Nandyala: ప్రజా సమస్యలపై ఎస్పీ సీరియస్.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!
Nandyala: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’. ఎస్పీ సునీల్ షొరాణ్ స్వయంగా 60 ఫిర్యాదులు స్వీకరణ.
Nandyala: ప్రజా సమస్యలపై ఎస్పీ సీరియస్.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!
Nandyala: నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల నుంచి మొత్తం 60 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ
ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామని, ప్రతి ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే సంబంధిత అధికారులకు సూచనలు చేస్తూ ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలి ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకూడదుచట్టపరమైన అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.
ప్రధాన ఫిర్యాదుల వివరాలు..
ఉద్యోగం పేరుతో మోసం నంద్యాల పట్టణానికి చెందిన సురేష్ అనే వ్యక్తి రాజు అనే వ్యక్తి SC కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ₹1,50,000 తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో లోన్ షేక్ ఖాజా అనే నిరుద్యోగి తన పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ₹6 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారని, దీంతో తాను ఇబ్బందులు పడుతున్నానని విన్నవించారు.
భూమి కబ్జా వివాదం శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన చిన్నయ్య తన పొలాన్ని కబ్జా చేసి దారిని మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న ఈ వేదికకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.




