Nandyala: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Nandyala: నంద్యాల రైల్వే స్టేషన్‌లో చైన్ స్నాచింగ్ నివారణపై పోలీసుల ప్రత్యేక నిఘా. వేసవి ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి కర్నూలు రైల్వే సీఐ కీలక ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:42 PM IST
Nandyala
X

Nandyala: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Nandyala: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రతపై రైల్వే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కర్నూలు రైల్వే పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో నంద్యాలలో కీలక బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో RPSI నంద్యాల, గిద్దలూరు RPF SI, నంద్యాల GRP, RPF సిబ్బంది మరియు నంద్యాల జిల్లా నుండి రిపోర్ట్ అయిన సివిల్ ఫోర్స్ పాల్గొన్నారు.

ఇటీవల పెరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ACP (అలారం చైన్ పుల్లింగ్) ద్వారా దోపిడీలు, సిగ్నల్ టాంపరింగ్ చేసి చైన్ స్నాచింగ్ చేయడం వంటి నేరాలపై సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించారు.

అటువంటి ఘటనలను ముందుగానే అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యవేక్షణ విధానాలు, ప్రివెంటివ్ చర్యలను అధికారులిచ్చిన సూచనల్లో వివరించారు.అదే సమయంలో RPF అధికారులతో సమన్వయం బలోపేతం చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించారు.ప్రయాణికుల భద్రతే లక్ష్యం అని అధికారులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story