Indukurpet: కార్యకర్తల కష్టాల్లో వెన్నంటే ఉంటాం మాజీ మంత్రి నల్లపురెడ్డి
Indukurpet: ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో దివంగత నేత కొండూరు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు.
Indukurpet: కార్యకర్తల కష్టాల్లో వెన్నంటే ఉంటాం మాజీ మంత్రి నల్లపురెడ్డి
Indukurpet: మాజీ మంత్రివర్యులు రాష్ట్ర వైసీపీ పిఎసి సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, స్వర్గీయ కొండూరు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో , నేడు గంగపట్నం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ సుధాకర్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
పార్టీకి ఎంతో సేవ చేసిన స్వర్గీయ కొండూరు సుధాకర్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి కుటుంబం కూడా పార్టీ, తమ కుటుంబంగా భావించి అన్ని విధాల తోడుగా ఉంటుందని చెప్పారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజల మధ్యనే ఉంటామని , వారి కష్ట నష్టాలలో ఎప్పుడూ వెన్నంటే ఉంటామని చెప్పారు.
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. వారితో పాటు
వైసీపీ నాయకులు మవులూరు శ్రీనివాసులురెడ్డి , గొల్లపల్లి విజయకుమార్, బట్టేపాటి నరేంద్ర రెడ్డి , కొండూరు కృష్ణారెడ్డి, చిరమణ గోపాల్ రెడ్డి , పంబాల జనార్దన్ రెడ్డి , దండిగుంట ఫణి నాయుడు, సిగినం సుబ్రమణ్యం, శరత్ పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.




