Saripalli: చెరువుల భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత
Saripalli: పెందుర్తి మండలం సరిపల్లిలో 'చెరువుల భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు, కలెక్టర్ అభిశిక్తి కిషోర్ ప్రారంభించారు.
Saripalli: చెరువుల భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత
Saripalli: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు జల వనరులను పెంపొందించి తద్వారా నీటిమనరులను సద్వినియోగం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో చెరువులు భద్రత -సాగునీటి సంఘాల బాధ్యత అనే భారీ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం పరిధి, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని పినచెరువు వద్ద చెరువుల అభివృద్ధి సాగునీటి సంఘాలు బాధ్యత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముట్టంబాకం అభిశిక్తి కిషోర్ తో కలిసి సోమవారం ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు.
ముందుగా చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు సాగునీటి సంఘం అధ్యక్షులు సభ్యులు స్థానిక రైతులు ప్రజలతో మాట్లాడి సాగు విస్తీర్ణం, పంట సాగు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జలవనరులను పెంపొందింప చేయాలనే లక్ష్యంతో 100 రోజులు ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ కార్యక్రమంలో మొదటి ఐదు రోజులు అధికారులు సర్వే చేసి అవసరమైన నివేదిక తయారుచేసి అనుమతులు పొందుతారని, ఆ తర్వాత 80 రోజుల్లో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం నీటి వనరులు, పనులు పూర్తయిన తర్వాత నీటి వనరుల లభ్యతపై స్పష్టమైన నివేదిక వెల్లడిస్తారని తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని ఎప్పుడు అధికారంలో ఉన్న వారి అభివృద్ధి కోసం నిరంతరం తపన పడతారని తెలిపారు. కాగా పెందుర్తి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున నిధులు మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు కలెక్టర్ అభిశక్తి కిషోర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే రైల్వే ట్రాక్ అవతల సుమారు 250 ఎకరాల సాగుభూములు ఉన్నాయని అక్కడి నుండి పంటలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని, రైల్వే ట్రాక్ కింద నాటక బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ సరిపల్లి రైతుల అభ్యర్థులపై స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారని ఆయనతో చర్చించి అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ అభిశక్తి కిషోర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన తాను విశాఖ కలెక్టర్ గా రావడం ఆనందంగా ఉందని, అందులోనూ తొలిసారి పెందుర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో పర్యటించడం జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చెరువులు అభివృద్ధి సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సరిపల్లి ను అన్ని విధాల అభివృద్ధి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ఇరిగేషన్ ఎస్ ఈ అప్పలనాయుడు, ఎంపిటిసి గొల్లవిల్లి రమణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నీటి సంఘం ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులుతో పాటు స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




