Anantapur: జగజీవన్ రామ్ స్ఫూర్తితోనే ఏపీలో పాలన.. మడకశిర ఎమ్మెల్యే

Anantapur: అనంతపురంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 2:48 PM IST
Anantapur
X

Anantapur: జగజీవన్ రామ్ స్ఫూర్తితోనే ఏపీలో పాలన.. మడకశిర ఎమ్మెల్యే

Anantapur: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. బాబు జగజ్జివన్ రావు 119వ జయంతి సందర్భంగా అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తో కలిసి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పూలమాలవేసి నివాళులు అర్పించారు.

రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాబు జగజీవన్ రావు స్ఫూర్తితోనే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారన్నారు. అంటరానితనం వివక్షతను ప్రారుదోలేలా గ్రామస్థాయి నుంచి చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేడు రాజకీయ పరిపాలన సాగుతోందన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story