Pattikonda: బంగారు కుటుంబాలుగా నిరుపేదలను తీర్చిదిద్దుదాం
Pattikonda: పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ పత్తికొండ టీటీడీ కల్యాణ మండపంలో అధికారులతో కలిసి పి.4 (P4) కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Pattikonda: బంగారు కుటుంబాలుగా నిరుపేదలను తీర్చిదిద్దుదాం
Pattikonda: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి 4 కార్యక్రమాన్ని అధికారులతో కలిసి తిలకించిన ఎమ్మెల్యే శ్యాం కుమార్. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా మలుద్దామని, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ధైర్యాన్ని భరోసాని నింపుదామని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ. శ్యాం కుమార్ పిలుపునిచ్చారు.
సోమవారం పత్తికొండ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో పి.4 కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ పై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా పి ఫోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి అమలుపరుస్తుందన్నారు.
పి ఫోర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం అన్నారు. 2047 నాటికి పేదరికం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొలబడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు. సామాన్య ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, భాగస్వామ్యంతో ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని సూక్ష్మంగా పిఫోర్ అని నామకరణం చేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండేందుకు ముఖ్యంగా పల్లెల్లో బడుగు బలహీన వర్గాలను దత్తత తీసుకొని వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేందుకు ఉన్నత వర్గాలను ప్రోత్సహించడం
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నారు. కావున గ్రామాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు సంపన్నులు బడుగు బలహీన వర్గాల వారిని ఆదరించి వారి ఆర్థిక వెన్నుదన్నుకు సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అట్లా ప్రమోద్ కుమార్ రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ రెడ్డి, తాసిల్దార్ హుస్సేన్ సాహెబ్, ఎంపీడీవో కవిత టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




