MLA Kakarla Suresh: ప్రభుత్వంతో పాటు మా ట్రస్ట్ ద్వారా పూర్తి సాయం

MLA Kakarla Suresh: మార్కాపురం బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. దాసరిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు మృతిపై సంతాపం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 4:37 PM IST
MLA Kakarla Suresh
X

MLA Kakarla Suresh: ప్రభుత్వంతో పాటు మా ట్రస్ట్ ద్వారా పూర్తి సాయం

Nellore: మార్కాపురం జిల్లా కేంద్రానికి సమీపంలో రాయవరం వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. సమాచారం తెలిసిన అనంతరం ఆయన మార్కాపురం వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. అక్కడ నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో పూర్తిగా దగ్ధమైన బస్సును పరిశీలించారు.. ఎక్కువమంది గాయపడ్డ వారు ఉదయగిరి ప్రాంతానికి చెందినవారు కావడంతో. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అక్కడి వైద్యులు, స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు జిల్లా యంత్రాంగం ద్వారా క్షతగాత్రులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి సాధించాలని, అధికారులకు విజ్ఞప్తి చేశారు.. ఇదే సమయంలో బాధితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు, కుటుంబ సభ్యులకు ఆయన తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించడం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో, కావలి ఆర్డీవో కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఉండడంతో దాని ద్వారా బాధితుల కుటుంబాలకు, ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఆయన అధికారులను కోరారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉదయగిరి మండలం దాసరిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ ప్రమాదకర ఘటనలో మృత్యువాత పడినట్లు తెలియడంతో, వారి కుటుంబ సభ్యులను ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఓదార్చారు. ప్రభుత్వ పరంగా, తమ ట్రస్ట్ ద్వారా కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story