Gandepalli: ధాన్యం కొనుగోలు షురూ.. సకాలంలో చెల్లింపులు

Gandepalli: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రపాలెంలో రబీ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 5:58 PM IST
Gandepalli
X

Gandepalli: ధాన్యం కొనుగోలు షురూ.. సకాలంలో చెల్లింపులు

Gandepalli: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామంలో పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రబీ 2025-26 ధాన్యం కనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ.. కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ ముఖ్య అతిథులుగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టామని జిల్లాలో ధాన్యం సేకరణకు 227 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని, యంత్ర పరికరాలను సమకూర్చడం జరిగిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధాన్యం కనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్విని చేసుకోవాలని జేసీ కోరారు.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యం అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార అంతరంగాన్ని అప్రమత్తం చేసిందని, రబీ సీజనులో 09 ధాన్యం కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలోనే తమ బ్యాంకు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పోతుల మోహనరావు, కందుల చిట్టిబాబు, ఎర్రంశెట్టి బాబ్జి, జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, కొత్త భైరవకృష్ణ తదితరులతో పాటు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. విజయ్ కుమార్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ వై.మాలకొండయ్య, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం దేవుల‌‌‌ నాయక్, పౌరసరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, డీసీవో బి.శ్రీనివాస్ రెడ్డి, జగ్గంపేట ఎడిఎ జీ.శ్రీనివాసు; జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, గండేపల్లి మండలం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో కె.సత్య హరి కృష్ణ రెడ్డి, మండల వ్యవసాయ అధికారిని జె.లక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి కాళ్ళ బలరామకృష్ణ , గ్రామ సర్పంచ్ ముత్యాల దుర్గారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు జాన్ క్రిస్టోఫర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story