Kurnool: మరాఠీ కులస్తుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెర.. ఎమ్మెల్యే దస్తగిరి చొరవ

Kurnool: కోడుమూరు మండలం కొత్తపల్లిలో మరాఠీ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాల పంపిణీ.

C. Ganesh, Kodumuru
Published on: 26 March 2026 12:43 PM IST
Kurnool
X

Kurnool: మరాఠీ కులస్తుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెర.. ఎమ్మెల్యే దస్తగిరి చొరవ

Kurnool: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరాఠీ కులస్తులకు న్యాయం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే దస్తగిరి,కెడిసిసి బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామంలో కులద్రువీకరణ పత్రాల బహుకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ మరాఠీ సమాజానికి చెందిన అర్హులైన వారికి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCCB) చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి తో కలిసి కుల ధృవీకరణ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడం తమ బాధ్యతగా భావించి, ప్రతి అర్హుడికి న్యాయం జరుగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు ,సర్పంచ్ బాలకృష్ణ టీడీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story