Minister Narayana: కులమతాలకు అతీతంగా.. పేదరికాన్నే చూసిన మంత్రి నారాయణ!

Minister Narayana: రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డ్రైవర్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 10:26 AM IST
Minister Narayana
X

Minister Narayana: కులమతాలకు అతీతంగా.. పేదరికాన్నే చూసిన మంత్రి నారాయణ!

Minister Narayana: సహజంగా రాజకీయ నాయకులు పబ్లిసిటీ కోసం ప్రాకులాడటం మనం చూస్తూ ఉంటాం. అందుకు భిన్నంగా.. ఆపదలో ఉన్న వారికి రాజకీయం చూడకుండా సాయం అందించే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అలాంటి నాయకులే మన పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. కులం చూడలేదు-రాజకీయం అసలే చేయలేదు.. కేవలం మానవత్వమే చూపి మనిషితత్వం చాటాడు.

పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకున్న మంత్రి నారాయణ, 17 ఏళ్లుగా ప్రత్యర్థి పంచన ఉన్న వ్యక్తి ఆపదలో ఉన్నాడని ఆపన్నహస్తం అందించాడు. రాజకీయాలకు అతీతంగా మానవత్వమే అజెండాగా సాయం అందించారు. వైసీపీ మాజీ మంత్రి డ్రైవర్‌కు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించి తనలోని మానవత్వపు పరిమళాన్ని మరోసారి నిరూపించుకున్నారు మంత్రి నారాయణ.

గోమతి నగర్ క్యాంప్ కార్యాలయం వేదికగా తన మంచితనాన్ని చాటుకొన్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వద్ద సుమారు 17 ఏళ్లుగా నమ్మకమైన డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులుకు, ఆయన రాజకీయ నేపథ్యాన్ని చూడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం అర్థించగా, అతను వైసీపీ ముఖ్య నేత అనుచరుడని తెలిసినప్పటికీ, మంత్రి నారాయణ స్పందించి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో కులం, మతం, రాజకీయం చూడమని.. కేవలం పేదరికాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story