Nellore: సిటీలో "సుడిగాలి పర్యటన" చేసిన మంత్రి నారాయణ
Nellore: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. జేమ్స్ గార్డెన్‌లో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు ప్రజా సమస్యలపై ఆరా తీశారు.
Nellore: సిటీలో "సుడిగాలి పర్యటన" చేసిన మంత్రి నారాయణ
Nellore: నెల్లూరు సిటీ లో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి నారాయణ..పొర్లుకట్ట వద్ద కోటి ఇరవై లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో నెల రోజుల్లో రోడ్డు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ వీధి తిరిగి ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు.
మంత్రే తమ ఇళ్లవద్దకు వచ్చి సమస్యలు అడగటంతో హర్షం వ్యక్తం చేశారు పొర్లుకట్ట వాసులు. ఆత్మకూరు బస్టాండు వద్ద 28 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం జేమ్స్ గార్డెన్ లో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు. వెంకటేశ్వర పురం ,గాంధీ గిరిజన కాలనీల్లో స్కూల్స్ ని పరిశీలించి ,ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొన్నారు మంత్రి నారాయణ.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..
తమది పేదల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు.. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని , కూడు , గూడు ,నీడ కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని చెప్పారు.
భగత్ సింగ్ కాలనీలో 2014-19 లోనే 5 వేల టిడ్కో ఇళ్ళు నిర్మించామని గుర్తు చేశారు..వాటిని కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, తిరిగి వాటిని చక్కదిద్దుతున్నామని చెప్పారు మంత్రి నారాయణ. టిడ్కో ఇళ్ళ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాల నిర్మించబోతున్నామని, పేదపిల్లలకు అత్యున్నత విద్య అందించాలన్న యువనేత లోకేష్ విజన్ కి అనుగుణంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు..
పేదలు నివసించే పొర్లుకట్టలో రోడ్డు నిర్మించి , 40 ఏళ్ళ సమస్యను పరిష్కరించబోతున్నామని చెప్పారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సీసీ రోడ్డు నిర్మిస్తానని మాటిచ్చానని, మాట ప్రకారం 28 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశానని చెప్పారు. నెల రోజుల్లో ఈ రోడ్డును ప్రారంభిస్తామని తెలిపారు.
సిటీ లో 30 వ వాటర్ ప్లాంట్ ను ఈరోజు ప్రారంభించామని, 120 ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్ నగర వాసులకు అందిస్తామని తెలిపారు. రూ.2 ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని, సిటీ లో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభ్రివృద్ది పనులను జూన్ 12 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్ది రోల్ మోడల్ గా నిలబెడతానని చెప్పారు మంత్రి నారాయణ.




