Nellore: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ వసతులు.. మంత్రి హామీ
Nellore: నెల్లూరు వీఆర్ హైస్కూల్లో అత్యాధునిక డైనింగ్ హాల్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి,
Nellore: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ వసతులు.. మంత్రి హామీ
Nellore: వీఆర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ ను ప్రారంభించారు మంత్రి నారాయణ. మిడ్ డే మీల్స్ లో నాణ్యతను పరిశీలించిన అనంతరం, మెనూ అమలుపై పిల్లలని అడిగి తెలుసుకొన్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి , మిడ్ డే మీల్స్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. థాంక్యూ నారాయణ సార్ అంటూ విద్యా ప్రదాతకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు. స్కూల్ కు తగ్గట్టే డైనింగ్ హల్ ఏర్పాటు చేసారంటూ హర్షం వ్యక్తం చేశారు పేరెంట్స్.
అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ. విఆర్సీలో వెయ్యిమంది నిరుపేద పిల్లలు విద్యాబ్యాసం చేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన సాగుతోందని, అదే స్థాయిలో డైనింగ్ హల్ నిర్మించామని తెలిపారు. ఒకేసారి 400 మంది పిల్లలు భోజనం చేయొచ్చని చెప్పారు. మొదటి అంతస్థు కూడా పూర్తయితే 800 మంది సీటింగ్ ఉంటుందని తెలియజేశారు.
డైనింగ్ హాల్ ని కార్పొరేట్ స్కూల్స్ లో కంటే బాగా కట్టారని, అందుకు ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులని అభినందిస్తున్నాని అన్నారు. తన కూతురు షరణి విఆర్సీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోందని,P 4 ద్వారా కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ హై స్కూల్స్ ని వీఆర్సీ కి ధీటుగా సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ.




