Minister Narayana: ప్రతిపక్షం విషం కక్కుతుంది.. మంత్రి నారాయణ ఫైర్!
Minister Narayana: అమరావతి రాజధాని అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్, బొత్స, సజ్జల విషం కక్కుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Minister Narayana: ప్రతిపక్షం విషం కక్కుతుంది.. మంత్రి నారాయణ ఫైర్!
Minister Narayana: ఏపీ రాజధాని అమరావతిపై ప్రతిపక్షం విషం కక్కుతుందంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు ఏపీ పురపాలక శాఖ మంత్రి సిఆర్డిఏ చైర్మన్ డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. ఒకప్పుడు దేవతల రాజధానిగా భావించే అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతూ 2029 నాటికి ప్రపంచ రాజధానుల శ్రేణులు చేరబోతున్న సమయాన, అభివృద్ధిని చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక, విషం వెళ్లగక్కుతోందని ఆయన అన్నారు.
నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో మంత్రి నారాయణ పర్యటించారు..అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు అమరావతిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు..గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట తప్పి 'మూడు ముక్కలాట' ఆడారని, భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో వరల్డ్ బ్యాంక్ & ADB (15,000 కోట్లు), హడ్కో (11,000 కోట్లు), నాబార్డు (7,500 కోట్లు) నిధులు సమకూర్చుకుని రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతుంటే, అది చూసి ఓర్వలేక జగన్, బొత్స, సజ్జల వంటి నేతలు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ అమరావతిపై తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఆ 11 సీట్లు కూడా రావని ఘాటుగా హెచ్చరించారు.




