Nellore: రైతు శ్రమకు గౌరవం.. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్

Nellore: నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, అధికారులతో సమీక్ష. దేశంలోనే తొలిసారిగా బియ్యం బ్యాగులపై రైతు పేరుతో క్యూఆర్ కోడ్ (QR Code) విధానం అమలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:24 PM IST
Nellore
X

Nellore: రైతు శ్రమకు గౌరవం.. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్

Nellore: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్. కలెక్టరేట్ లో మిల్లర్లు, అధికారులు, రైతులతో ప్రత్యేక సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను ముద్రించి, రైతుల శ్రమను భావితరాలకు తెలిసేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పారు. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలల్లో, 400 కు పైగా సంక్షేమ వసతి గృహాల్లో రైతుల పండించిన సన్నబియ్యాన్ని పిల్లలకు అందించడం ద్వారా, వారు తింటున్న భోజనం తాలూకా ధాన్యం ఎవరు పండించారో తెలిసేలా బియ్యం సరఫరా బ్యాగులపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఈ మోడల్ ను దేశంలోనే మొదట అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుంది చెప్పారు. ఈ పద్ధతి దేశానికి రోల్ మోడల్ కానుందని అన్నారు. ఖరీఫ్ ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేస్తున్న నెల్లూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి, సోమవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. స్వయంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను, సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, రైతులు, జిల్లా అధికారులతో శ్రీ మనోహర్ గారు 3 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. జిల్లాలో ధాన్యం సేకరణకు ఉపయోగించే వాహనాల సమస్య, గోనె సంచుల సమస్య ఉందని దీని పరిష్కరించేలా సమష్టిగా పని చేయాలని సూచించారు. సమీక్ష అనంతరం మీడియాతో మనోహర్ గారు మాట్లాడుతూ " కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పారు.

అనంతరం రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు నాదెండ్ల మనోహర్..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బిడ్డలకు మేలైన రకం బియ్యం అందిస్తున్న రైతంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భావితరాలకు సన్నబియ్యంతో భోజనం అందించాలనే కూటమి ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా, రైతులు సహకరించారని. మద్దతు ధరకు ఏమాత్రం అదనపు బోనస్ అడగకుండానే భావితరాలకు అవసరమైన సన్న బియ్యం 2.80 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వానికి అందించారని తెలిపారు.

వారి సేవలు ఎనలేనివని, రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్ల పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో గానీ, రైతులను రోజులకు తరబడి రైస్ మిల్లుల వద్ద వేచి ఉండేలా చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. గన్ని బ్యాగుల పంపిణీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. సమీక్ష తర్వాత కూడా దారికి రాని రైస్ మిల్లర్లను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం పూర్తిగా రైస్ మిల్లర్లకు సహకరిస్తుందని తెలిపారు. వారు కూడా రైతులకు తగిన సహాయం చేసేలా పని చేయాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story