Nadendla Manohar: ఏపీలో గ్యాస్ ఫుల్.. టెన్షన్ వద్దు నెల్లూరులో మంత్రి క్లారిటీ!

Nadendla Manohar: ఏపీలో గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దు. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం ఉన్నా రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఆటంకం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 1:27 PM IST
Nadendla Manohar
X

Nadendla Manohar: ఏపీలో గ్యాస్ ఫుల్.. టెన్షన్ వద్దు నెల్లూరులో మంత్రి క్లారిటీ!

Nadendla Manohar: ఏపీలో గ్యాస్ కొరత లేదని స్పష్టీకరణ చేశారు- పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. మధ్యప్రాచ్య దేశాలలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు ఏపీ పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో గ్యాస్ కొరత మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. గ్యాస్.. అంతర్జాతీయ సమస్య.. గ్యాస్ కొరత లేకుండా ఉండేందుకు కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కొరత అనేది కేవలం కొందరి దుస్ప్రచారం మాత్రమే అన్నారు.. ఏపీలో 100 % గతం కన్నా ఎక్కువ సరఫరా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గ్యాస్ పంపిణీ అర్బన్ 25 రోజులు, రూరల్ లో 40 రోజులు రాష్ట్రం లో గ్యాస్ కొరత రాదన్నారు.

విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వగానే అక్కడికి సరఫరా అయ్యే గ్యాస్ ను సాధారణ.. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి మనోహర్ చెప్పారు. అధికారుల సమీక్షలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పౌరసరఫల విభాగం అధికారిణి లీలారాణి, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు, గ్యాస్ డీలర్ల ప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story