Palakonda: పాలకొండలో మంత్రి అచ్చెంనాయుడు పుట్టినరోజు వేడుకలు

Palakonda: పాలకొండలో మంత్రి అచ్చెంనాయుడు జన్మదిన వేడుకలు. గండి రామినాయుడు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 26 March 2026 5:08 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మంత్రి అచ్చెంనాయుడు పుట్టినరోజు వేడుకలు

పార్వతీపురం: మన్యం జిల్లా పాలకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు జన్మదిన వేడుకలు పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణి చేసారు అనంతరం స్థానిక వెంకటరాయని కోనేరు వద్ద అన్నదానం నిర్వహించారు. పాలకొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఘనంగా విందు ఏర్పాటు చేసి కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ సందర్బంగా పాలకొండ మండల టీడీపీ అధ్యక్షుడు,తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ఆదరణ పొందిన రాజకీయ నేత కింజరాపు అచ్చెంనాయుడు అని ఆయన జన్మదిన వేడుకలను గడచిన 25 ఏళ్లుగా పాలకొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని సహాయం కోరి ఎవరు ఆయన దగ్గరకు వెళ్లిన కాదనకుండా సాయం చేసే గొప్ప వ్యక్తి అచ్చెంనాయుడు అని కొనియాడారు. ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో కొనసాగి మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story