Parvathipuram: మహనీయునికి మంత్రి నివాళి.. పార్వతీపురంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంబరాలు. మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 12:37 PM IST
Parvathipuram
X

Parvathipuram: మహనీయునికి మంత్రి నివాళి.. పార్వతీపురంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు!

పార్వతీపురం మన్యం జిల్లా: బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి వర్యులు బి.సి.జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, విధివిధానాలు నేటి తరానికి ఎంతో సూర్తిదాయకమని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డితో కలిసి పూలమాలలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. భారత దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని, పేద ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా పైకి రావాలని ఆయన నిరంతరం తపించేవారని తెలిపారు. దేశం మరియు రాష్ట్రం కోసం నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన మహానాయకుడని, ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన విధానాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, అణగారిన వర్గాల గొంతుకగా ఆయన నిలిచారని గుర్తుచేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story