Anam Ramanarayana: మార్కాపురం ఘోర ప్రమాదం.. రంగంలోకి దిగిన మంత్రి ఆనం!

Anam Ramanarayana: మార్కాపురం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 1:28 PM IST
Anam Ramanarayana
X

Anam Ramanarayana: మార్కాపురం ఘోర ప్రమాదం.. రంగంలోకి దిగిన మంత్రి ఆనం!

Anam Ramanarayana: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమని,ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి ఆనం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి ఆనం , తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు పంపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు..బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

వరుసగా జరుగుతున్న బస్సు అగ్ని ప్రమాదాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆనం. అలాగే ప్రమాదం జరిగిన అనంతరం హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయం ని మూసివేయడంపై సీరియస్ అయ్యారు.. నిర్వాహకులు సరైన నిబంధనలు పాటించకపోతే ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల డేటా మొత్తం మెయింటైన్ చేయాలని ప్రభుత్వాన్నిబంధనలకు లోబడి ప్రైవేట్ ట్రావెల్స్ వారు వ్యవహరించాలని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణంకులు తీసుకు వెళుతున్న లగేజ్ లపై, బస్సు మెయింటినెన్స్ కండిషన్స్ పై పూర్తి దృష్టి సారించాలని సూచించారు మంత్రి ఆనం.

ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రావెల్స్ యాజమాన్యం వారిదేనని హెచ్చరించారు..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story