Rajagopal Reddy: బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి!

Rajagopal Reddy: మార్కాపురం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై మేకపాటి రాజగోపాల్ రెడ్డి దిగ్భ్రాంతి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 1:13 PM IST
Rajagopal Reddy
X

Rajagopal Reddy: బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి!

వింజమూరు: ఉదయం తెల్లవారిజాం జగిత్యాల నుండి కలిగిరికి వస్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మార్కాపురం సమీపంలో సజీవ దహనం ఘటన పై ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాద సమయంలో బస్ లో ఉదయగిరి నియోజకవర్గం కి సంబంధించి వింజమూరు,ఉదయగిరి మండలంకి చెందిన ప్రయాణికులు ఉన్నారని ప్రమాదంలో ఉదయగిరి మండలం దాసరిపల్లి బీసీ కాలనీకి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మరణించినట్లు సమాచారమ్ వుందని.. మరణించిన వెంకటేశ్వర్లు కుటుంబం కి ప్రభుత్వం 50 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని, క్షతగాత్రులను కూడా పూర్తి భాధ్యత తీసుకుని ప్రభుత్వమే వారికీ మెరుగైన వైద్యం అందించాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈ సందర్భంగా కోరారు.

ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి భాద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, రవాణా అధికారులు ఖచ్చితమైన తనిఖీలు చేపట్టి ఫిట్ నెస్ లేని వాహనాలు నివారించాలని ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని మేకపాటి ఈ సందర్భంగా కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story