Annamayya: నమ్మితే నట్టేట ముంచాడు.. లక్షలతో ఉడాయించిన జువెలరీ షాపు మేనేజర్!

Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బంగారం చీటీల పేరుతో భారీ మోసం జరిగింది. ప్రముఖ జువెలరీ షాపు మేనేజర్ వినియోగదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 10:33 AM IST
Annamayya
X

Annamayya: నమ్మితే నట్టేట ముంచాడు.. లక్షలతో ఉడాయించిన జువెలరీ షాపు మేనేజర్!

Annamayya: అన్నమయ్యి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. మదనపల్లిలో నమ్మకమే పెట్టుబడిగా సాగే బంగారం చీటీల వ్యాపారం పేరుతో లక్షల్లో వసూలు చేసిన జువెల్లరీ స్టోర్స్ బోర్డు తిప్పేసింది. నగదు చెల్లించిన వినియోగదారులు బంగారం కోసం వెళ్లగా ధర తగ్గుతుందని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చిన మేనేజర్ నగదుతో వుడాయించాయిడు. వినియోగదారులు లబో దిబోమంటూ తలలు బాధుకుంటున్నారు, జువెల్లరీ షాపు యజమాని సూరజ్ చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక ప్రముఖ జువెలరీ దుకాణం మేనేజర్ వినియోగదారుల సొమ్ముతో ఉడాయించాడు. తమ వద్ద నెలనెలా చీటీలు కడితే.. గడువు ముగిసిన తర్వాత తరుగు, కూలీ లేకుండా బంగారం ఇస్తామని నమ్మబలికాడు సదరు మేనేజర్. దీనిని నమ్మి డాక్టర్ లతశ్రీ అనే బాధితురాలు తన తల్లితో కలిసి లక్షల రూపాయలు చెల్లించారు. గడువు ముగిసిన తర్వాత బంగారం కోసం వెళ్లగా.. ధర తగ్గుతుందని సాకులు చెప్పి మేనేజర్ సూరజ్ కాలయాపన చేశాడు. తీరా సోమవారం సాయంత్రం బాధితులు దుకాణానికి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. మేనేజర్ సూరజ్ తన చేతివాటం ప్రదర్శించి, ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును యాజమాన్యానికి కట్టకుండా.. రికార్డుల్లో తక్కువ చూపిస్తూ దాదాపుగా అందరినీ ముంచేశాడు.

పుస్తకాల్లో రూ. 2 లక్షలు ఉండగా, ఆన్‌లైన్‌లో కేవలం రూ. 35 వేలే చూపిస్తోంది ఇప్పటికే దాదాపు 15 మంది వరకు బాధితులు బయటకు వచ్చారు. మోసపోయామని గ్రహించిన లతశ్రీ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు సూరజ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బంగారం చీటీలు కట్టే వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story