Kurnool: వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయ ముఖాముఖి.. సమస్యలపై ఆరా
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గోనెగండ్ల మండలంలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
Kurnool: వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయ ముఖాముఖి.. సమస్యలపై ఆరా
Kurnool: లబ్దిదారుల ముంగిటకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందచేస్తూ, ఏప్రిల్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 35 వేల 692 మంది లబ్దిదారులకు రూ.104.18 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామంలో అయ్యమ్మ కు వృద్ధాప్య పెన్షన్, నాగలక్ష్మి, రంగమ్మ లకు వితంతువు పెన్షన్, బోయ చిన్న సోమన్న, శ్రీ నిత్య, రహేలమ్మ లకు వైకల్య పెన్షన్ లను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారులకు పెన్షన్ లను పంపిణీ చేస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడుతూ ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందిస్తున్నారా, అని కలెక్టర్ ఆరా తీశారు.
నాగలక్ష్మి కి వితంతువు పెన్షన్ అందచేస్తున్న సమయంలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయడం కాకుండా పాడి పశువులను కూడా పెంచుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రమణారెడ్డి, గోనెగండ్ల తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ మణి మంజరి, తదితరులు పాల్గొన్నారు.




