Kovur: అన్నీ ఇచ్చాకే ఖాళీ చేయించాం.. ఇళ్ల తొలగింపుపై రచ్చ!
Kovur: కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో ఇళ్ల తొలగింపుపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ నాయకులు ఖండించారు.
Kovur: అన్నీ ఇచ్చాకే ఖాళీ చేయించాం.. ఇళ్ల తొలగింపుపై రచ్చ!
Kovur: కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు పంచాయతీ స్టవ్ బీడీ కాలనీ ప్రాంతంలో రోడ్డుకు పక్కన ఉన్న ఇళ్ల తొలగింపు ఘటనపై టిడిపి మండల నాయకులు మాట్లాడుతూ, స్థానికులు వైఎస్ఆర్సిపి నాయకుల ప్రలోభాలకు లోనై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసి, బిల్లులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
ఇదే విషయంపై స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా, నివాసితులకు సుమారు రెండు నెలల గడువు ఇచ్చినట్లు, ఆ తరువాత వారు స్వచ్ఛందంగానే ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు. అనంతరం, ఆ ప్రదేశాన్ని జెసిబి సహాయంతో చదును చేయడాని మాత్రమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
వైఎస్ఆర్సిపి నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి నాయకులు, గత ప్రభుత్వ కాలంలో అనేక స్థలాలను అక్రమంగా కబ్జా చేసి విక్రయించారని ఆరోపించారు. ఇళ్ల తొలగింపు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, స్థానికులు స్వచ్ఛందంగానే ముందుగా ఖాళీ చేశారని తెలిపారు. ఇది కేవలం వైఎస్ఆర్సిపి నాయకులు ఒకరిద్దరి స్థానికుల ప్రలోభాల వల్లనే ఎమ్మెల్యే పై బురద చల్లని చేస్తున్న కుట్రగా మండల టిడిపి నాయకులు ఖండించారు.




