Kanchili: సర్కారు బడి.. పతకాల గడి.. మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో పతకాల వేట!
Kanchili: ఢిల్లీలో జరిగిన జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ - 2025లో కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఘన విజయం.
Kanchili: సర్కారు బడి.. పతకాల గడి.. మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో పతకాల వేట!
Kanchili: ఢిల్లీలో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ - 2025లో కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. బంగారు, రజిత, కాంస్య పతకాలను కైవసం చేసుకుని పాఠశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. పాఠశాలకు చెందిన సాయికిషోర్ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియా యువశ్రీ బంగారు పతకాలతో.. మారేడు దీపిక, నక్క పవన్, గణప అవంతిక, కొండా శ్యాం రజిత పతకాలతో.. లోపింటి ధనలక్ష్మి, గుడియా చరణ్, గగన్ పాత్రో, లండ ప్రసాద్ రెడ్డి, యజ్జల పూజ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
దీంతో వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ చాణక్య, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. అనంతరం ప్రశంసపత్రాలు, మెడల్స్ తో విద్యార్థులను సత్కరించారు. ఒలంపియాడ్ కు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన గణిత ఉపాధ్యాయుడు అశోక్ కుమార్, సూర్యప్రకాష్, ప్రసాదరావు, సుధాకర్ లను ప్రత్యేకంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


