Kadapa: నేరస్తులకు పోలీసుల వార్నింగ్.. వైఎస్సార్ కాలనీలో తనిఖీ
Kadapa: కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో 'ఆపరేషన్ వజ్రప్రహార్' నిర్వహించారు.
Kadapa: నేరస్తులకు పోలీసుల వార్నింగ్.. వైఎస్సార్ కాలనీలో తనిఖీ
Kadapa: కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుఝామున కడప డి.ఎస్.పీ శ్రీ ఎ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌకు పి.ఎస్ పరిధిలోని వై.ఎస్.ఆర్ కాలనీలో చిన్నచౌకు సి.ఐ ఓబులేసు ఆధ్వర్యంలో కడప టూ టౌన్ సి.ఐ జి.ప్రసాద రావు, ఎస్.ఐ రామకృష్ణ, సిబ్బందితో 'ఆపరేషన్ వజ్రప్రహార్' లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు మరియు అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్థులు ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా మీరు మీ పనులు చేసుకుంటూ ఆర్ధికంగా ఎదిగి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలని సూచించారు. ఎవరూ రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని కడప డి.ఎస్.పీ శ్రీ ఎ.వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.




