Nellore: అసమానతలు లేని సమాజమే జగ్జీవన్ రామ్ లక్ష్యం
Nellore: నెల్లూరు నగరం వేదాయపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Nellore: అసమానతలు లేని సమాజమే జగ్జీవన్ రామ్ లక్ష్యం
Nellore: అణగారిన వారి గళాన్ని వినిపిద్దాం..అవకాశం లేకపోతే సృష్టిద్దాం. అన్యాయం చూస్తే ఎదురిద్దాం, అసమానతలు లేని సమాజం స్థాపిద్దాం అని తన జీవితంతోనే నిరూపించిన మహా నేత భారత మాజీ ప్రధాని స్వాతంత్య్ర సమర యోదులు డా.బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు జనసేన నాయకులు కిషోర్ గునుకుల. నెల్లూరు నగరం, వేదాయపాలెంలో ఈ రోజు భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
బాబు జగజ్జీవన్ రామ్ గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. దేశానికి ఉప ప్రధానమంత్రిగా (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా) సేవలందిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల సాధికారత కోసం డిప్రైజ్డ్ లీగ్ ప్రారంబించి వారు చేసిన కృషి అపారమని గుర్తుచేశారు.
ఆయన చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రాసంగికమని తెలిపారు. జనసేన పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంటుందని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,13వ డివిజన్ నాయకులు పేనేటి శ్రీకాంత్,49 వ డివిజన్ నాయకుడు హరి,బ్లూ బర్డ్ సంస్థ అధినేత వేమన శివకృష్ణ,జెన్ జీ నాయకులు హర్ష,రమేష్,చంటి,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ స్థానిక జనసేన నాయకులు, పాల్గొన్నారు.




