Vinjamur: సీఎం పర్యటనకు సర్వం సిద్ధం.. కలెక్టర్ సమీక్ష!
Vinjamur: వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు.
Vinjamur: సీఎం పర్యటనకు సర్వం సిద్ధం.. కలెక్టర్ సమీక్ష!
Vinjamur: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.బుధవారం వింజమూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వింజమూరు బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్న హెలీపాడ్, వింజమూరు చెరువు ఆధునీకరణ, ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి త్వరలోవింజమూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయా శాఖ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ పావని, డిఆర్డిఏ, డ్వామా పీడీలు నాగరాజకుమారి, గంగా భవాని, విద్యుత్ శాఖ ఎస్ ఈ రాఘవేంద్రన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.




