Nandyala: భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ఊరంతా పండగ వాతావరణం!

Nandyala: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరులో పెద్దమ్మతల్లి 16 రోజుల పండుగ ఘనంగా నిర్వహణ. 20 వేల మందికి అన్నదానం.

Rama Mohan, Banaganapalle
Published on: 26 March 2026 3:18 PM IST
Nandyala
X

Nandyala: భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ఊరంతా పండగ వాతావరణం!

నంద్యాల జిల్లా: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో పెద్దమ్మతల్లి 16 రోజుల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పెద్దమ్మ దేవర ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు పోటెత్తారు.

ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు, మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోలాహలంతో టంగుటూరు పుణ్యక్షేత్రాన్ని తలపించింది.

Rama Mohan, Banaganapalle

Rama Mohan, Banaganapalle

Next Story