Gopalapuram: పుష్కరాల నిధుల వేటలో ఎమ్మెల్యే.. కలెక్టర్ సానుకూల స్పందన!

Gopalapuram: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో భేటీ. వరి ధాన్యం కొనుగోలు, గోదావరి పుష్కరాల నిధులు మరియు నియోజకవర్గ అభివృద్ధిపై వినతి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 4:43 PM IST
Gopalapuram
X

Gopalapuram: పుష్కరాల నిధుల వేటలో ఎమ్మెల్యే.. కలెక్టర్ సానుకూల స్పందన!

తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు కలెక్టర్‌ను కలిసిన సందర్భంగా కీలక వినతులు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట రాజు ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రబీ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. మూడు మండలాల పరిధిలో ఉత్పత్తి అయ్యే 94 వేల మెట్రిక్ టన్నులలో కనీసం 85 వేల టన్నుల (90%) వరిని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సకాలంలో జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు.

అదేవిధంగా రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోపాలపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు మరియు దేవాలయాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

మూడు మండలాల పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం అవసరమైన గ్రాంట్లు మంజూరు చేయాలని కూడా ఎమ్మెల్యే కలెక్టర్‌ను అభ్యర్థించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story