Rajole: సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.. గొల్లపల్లి అమూల్య

Rajole: రాజోలు మండలం తాటిపాకలో విజేత సోలార్ కార్యాలయాన్ని గొల్లపల్లి అమూల్య ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 6 April 2026 5:52 PM IST
Rajole
X

Rajole: సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.. గొల్లపల్లి అమూల్య

Rajole: సౌరశక్తి వినియోగం పట్ల ప్రజలందరూ మరింత అవగాహన పెంచుకోవాలని రాజోలు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు. రాజోలు మండలం తాటిపాక లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సోలార్ రీజినల్ కార్యాలయాన్ని అమూల్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ. సౌర శక్తి వినియోగం ద్వారా పర్యావరణ హితంతో పాటు, విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించు కోవచ్చు అని అన్నారు.

రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం వల్ల బిల్లులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారం కాకూడదని ప్రభుత్వాలు ఆలోచన చేశాయని, అందులో భాగంగా సౌర విద్యుత్ (సోలార్ విద్యుత్) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త బిజిలీ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని అమూల్య వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు), అనుచూరి రామ పురుషోత్తం, విజేత సోలార్ సిస్టమ్స్ సీఈవో వై. వెంకటేశ్వరరావు, సంస్థ రీజనల్ హెడ్ ఆకుమర్తి శ్రీను, N పరంకుశ రావు, పిల్లి శ్రీరామూర్తి, కట్టా సూరిబాబు, చిట్టూరి సంతోష్, సారిక ఆంజనేయులు, ర్యాలీ పట్టాభి రామయ్య పలువురు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story