Srikakulam: వణికిస్తున్న డయేరియా.. ఆసుపత్రి పాలవుతున్న జనం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో డయేరియా కలకలం రేపుతోంది. పదిమందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 3:02 PM IST
Srikakulam
X

Srikakulam: వణికిస్తున్న డయేరియా.. ఆసుపత్రి పాలవుతున్న జనం!

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని ఎగువ వీధిలో పలువురికి విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా గ్రామస్తులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పరిస్థితి విషమించడంతో కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పదిమందికి పైగా చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. తాగునీరు కలుషితమవడం వల్ల ఈ సమస్య తలెత్తిందా? లేక ఇతర ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించిందా అనే అనుమానాలను గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామంలో పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story