Bhimavaram: హిందువులపై దాడిని సహించం: భీమవరంలో వీహెచ్‌పీ గర్జన!

Bhimavaram: ఆకివీడు పెదపేటలో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ భారీ ర్యాలీ చేపట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 7:42 AM IST
Bhimavaram
X

Bhimavaram: హిందువులపై దాడిని సహించం: భీమవరంలో వీహెచ్‌పీ గర్జన!

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో శ్రీరాముడి దర్శనానికి వెళ్లిన హిందువులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ ప్రాంతంలో రామాలయాన్ని పున నిర్మించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

జై శ్రీరామ్ అంటూ జువ్వలపాలెం రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల రాజు మీడియాతో మాట్లాడుతూ ఆకివీడు పెదపేటలో ఉన్న రామాలయానికి వందేళ్ల చరిత్ర ఉందని రికార్డులు చెబుతున్నాయి అన్నారు. శ్రీరామనవమి రోజున ఆ రామాలయంలో రాముడు పూజలు చేసి పానకాలు పంచిపెట్టడానికి వెళ్లిన హిందూ బంధువులపై అన్య మతస్థులు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాముడు విగ్రహానికి దండ వేయడానికి వెళ్తే అక్కడ మహిళలు కూడా అడ్డుకునే పరిస్థితి నెలకొందని హిందువులంతా గ్రహించాలని సూచించారు వేణుగోపాల్ రాజు ఆ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా 90 శాతం చర్చిల కు అనుమతులు లేవని , రాష్ట్ర ప్రభుత్వ వెంటనే వాటిని కూల్చేయాలని కోరారు మత మార్పిడిలు చేసుకుని నిజమైన ఎస్సీ హిందువులకు అన్యాయం చేస్తున్నారని వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు వేణుగోపాల్ రాజు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story