CPM Kala Jathara in Atmakur: మత్తు పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం: ఆత్మకూరులో సీపీఎం 'కళా జాతర' హోరు!

CPM Kala Jathara in Atmakur: రాష్ట్రంలో మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం అనుబంధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 3:10 PM IST
CPM Kala Jathara in Atmakur: మత్తు పదార్థాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం: ఆత్మకూరులో సీపీఎం కళా జాతర హోరు!
X

ఆత్మకూరు: రాష్ట్రంలో మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం అనుబంధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో నెల్లూరు జిల్లా డివైఎఫ్ఐ (DYFI), ఎస్ఎఫ్ఐ (SFI), ఐద్వా (AIDWA) నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరులో 'కళా జాతర' ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, అరాచకాలపై ప్రజలను మేల్కొలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందని విమర్శించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, సామాన్యులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు, నాటికల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కళాకారులు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అనుబంధ సంఘాల జిల్లా స్థాయి నేతలు, స్థానిక కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story