Dhone: రైల్వే గేట్ల వద్ద ప్రజల తిప్పలు.. పట్టించుకోని పాలకులు
Dhone: డోన్ పట్టణంలో రైల్వే గేట్ల సమస్యపై సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dhone: రైల్వే గేట్ల వద్ద ప్రజల తిప్పలు.. పట్టించుకోని పాలకులు
Dhone: డోన్ పట్టణంలో రైల్వే గేట్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు తెలిపారు. స్థానిక నక్కీ రామన్న భవన్‌లో మాట్లాడిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వంలో అండర్‌పాస్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగలేదని విమర్శించారు.
రోజువారీ రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా వేసవిలో గేట్లు ఎక్కువసేపు మూసివేయడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చొరవ తీసుకుని పనులు ప్రారంభించాలన్నారు. తాత్కాలికంగా చలువ పందిరి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభం కాకపోతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.
Next Story




