Nellore: సీఎం పర్యటనకు సర్వం సిద్ధం వింజమూరులో కలెక్టర్, ఎస్పీ హల్చల్!
Nellore: ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
Nellore: సీఎం పర్యటనకు సర్వం సిద్ధం వింజమూరులో కలెక్టర్, ఎస్పీ హల్చల్!
Nellore: ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో , జిల్లా ఎస్‌పి ISW అధికారులసమక్షంలో. VVIP సందర్శన పాయింట్స్ సంయుక్త పరిశీలన చేశారు.
ఏప్రిల్ 1న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలోని జాగీరు వనంలో జరగబోయే పర్యటన నేపథ్యంలో. జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా, మరియు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నేడు (30.03.2026) విస్తృత స్థాయి భద్రతా ఏర్పాట్లను మరోసారి సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు హెలిప్యాడ్, ట్యాంక్ బండ్ మరియు పార్క్, పెన్షన్ పంపిణీ కేంద్రం, నార్త్ ఎస్సీ కాలనీ, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశ స్థలాలను స్వయంగా సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ప్రదేశంలో భద్రతా బలగాల మోహరింపు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
వింజమూరులోని MRO కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన సభ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్‌పి గారు, ప్రజల రాకపోకలు, VIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అలాగే, హెలిప్యాడ్ ప్రాంతం వద్ద భద్రతా వలయాలను మరింత బలోపేతం చేయాలని, ప్రజా వేదిక మరియు కార్యకర్తల సమావేశ ప్రదేశాల్లో ప్రాపర్ యాక్సెస్ కంట్రోల్ తగిన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్యాంక్ బండ్, పార్క్ ప్రాంతాల్లో పర్యవేక్షణను పెంచి, అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
పెన్షన్ పంపిణీ కేంద్రం మరియు నార్త్ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ముందస్తు ప్రణాళికల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్‌పి శ్రీ కృష్ణారావు గారు, SB DSP శ్రీ A శ్రీనివాస రావు SDPO కావలి శ్రీ శ్రీధర్ గారు, SDPO ఆత్మకూరు శ్రీ వేణుగోపాల్ గారు, AR DSP శ్రీ చంద్రమోహన్, హోమ్ గార్డ్ యూనిట్ DSP శ్రీ రమణ గారు, సంబంధిత సిఐలు, ఆర్‌ఐలు, అలాగే రెవెన్యూ శాఖ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




