Palasa: ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో రామారావుకు ఆర్థిక భరోసా

Palasa: పలాస మండలం మామిడిపల్లికి చెందిన జడ్డె రామారావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మంజూరైంది.

B LOKANADHAM, PALASA
Updated on: 3 April 2026 7:29 PM IST
Palasa
X

Palasa: ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో రామారావుకు ఆర్థిక భరోసా

Palasa: పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన జడ్డె రామారావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందింది. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న రామారావు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులను విడుదల చేసింది.పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి.

తన కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీషకు రామారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం తన చికిత్సకు మరియు కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరిష తీరును అభినందించారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story