Tirupati: నాయుడుపేటలో చంద్రన్న నగారా.. నేడు టిడ్కో ఇళ్ల పంపిణీ!
Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేటలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన. టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.
Tirupati: నాయుడుపేటలో చంద్రన్న నగారా.. నేడు టిడ్కో ఇళ్ల పంపిణీ!
తిరుపతి జిల్లా: నాయుడుపేటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు విచ్చేస్తుండడంతో వారికి ఇటువంటిలు ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా భోజన ఏర్పాట్లను కూడా భారీగానే ఏర్పాటు చేశారు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు త్రాగునీరు భోజనం పలు ముఖ్యమైన సేవలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉదయాన్నే వారికి భోజనాలు తయారు చేపించి వాటిని ప్యాకింగ్ చేసి సభా ప్రాంగణానికి తరలించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు, అయితే నెలవల విజయ్ శ్రీ ఆధ్వర్యంలో ఆమె ఆదేశాల మేరకే ప్రజలకు సేవలందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈరోజు నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లా ప్రారంభంతోపాటు లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖాముఖి చర్చలు పాల్గొంటారు, ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక కోసం వేచి చూస్తున్నా ప్రజలు.




