Choppella: తారు ప్లాంట్లు వద్దు.. ప్రాణాలు ముద్దు!

Choppella: కోనసీమ జిల్లా చొప్పెల్ల గ్రామంలో తారు ప్లాంట్ల ఏర్పాటుపై గ్రామస్తుల ఆగ్రహం. శ్వాసకోశ వ్యాధులు వస్తాయని అమలాపురం కలెక్టర్‌కు ఫిర్యాదు.

SURESH, AMALAPURAM
Published on: 6 April 2026 3:12 PM IST
Choppella
X

Choppella: తారు ప్లాంట్లు వద్దు.. ప్రాణాలు ముద్దు!

Choppella: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం,చొప్పెల్ల గ్రామంలో తారు పరిశ్రమను తక్షణం తొలగించాలని డిమాండ్. తమ గ్రామంలో తారు ప్లాంట్ల తొలగించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన చొప్పెల్ల గ్రామస్తులు. సర్వే no 50/51 లో తారు ప్లాంట్లను నిర్మిస్తున్న కార్పొరేట్ సంస్థలు.

అమలాపురం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన గ్రామస్తులు. పర్యావరణం పాడవుతుంది అని ఆందోళన. శ్వాసకోశ వ్యాధులు ,అనారోగ్యం పాలవుతామని గ్రామస్తులు ఆందోళన తెలిపారు. గతంలో వద్దని ఆందోళన చేసిన కూడా ఇప్పుడు గ్రామస్తుల మాటలు లెక్కచేయకుండా ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్న నేపధ్యంలో ఆందోళనలో గ్రామస్తులు.

పచ్చటి పంటపొలాలతో సుబిక్యంగా ఉండే గ్రామం పాడవుతుందన్న గ్రామస్తులు. 15000 మంది జనాభా కలిగి ఉన్న గ్రామాన్ని కాపాడాలి. పిల్లలు, వృద్ధులు, ప్రజలు అనారోగ్యం పాలవుతారు తక్షణం ప్లాంట్లను తొలగించాలి. అందరం కూటమి ప్రభుత్వానికి ఓటు వేశాం మమల్ని కాపాడాలి. లారీలవల్ల ట్రాఫిక్ సమస్యలు ప్రాణభయంతో ఉన్నాం ప్రభుత్వం తక్షణం సంపాదించి న్యాయం చేయాలి.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story