ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ధూళిపాళ్ల కుమార్తె వివాహంలో అరుదైన దృశ్యం!
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చిన్న కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది.
ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ధూళిపాళ్ల కుమార్తె వివాహంలో అరుదైన దృశ్యం!
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చిన్న కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్.. పెళ్లి కుమార్తెతో జరిపిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయ్ సిద్ధంగా ఉండాలంటూ నారా లోకేష్ సరదాగా వ్యాఖ్యానించగా.. తమకు ఎసరు పెట్టొద్దంటూ ధూళిపాళ్ల నరేంద్ర నవ్వుతూ దండం పెట్టారు. దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి సహా అందరి ముఖాల్లోనూ నవ్వులు వెరిశాయి.
Next Story




