గిరిజన గ్రామాలకు రక్షణ కరువు.. అగ్నిమాపక కేంద్రంపై ప్రభుత్వానికి విన్నపం

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రెటరీ ములకలపల్లి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 12:57 PM IST
Velerupadu
X

గిరిజన గ్రామాలకు రక్షణ కరువు.. అగ్నిమాపక కేంద్రంపై ప్రభుత్వానికి విన్నపం

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా సెక్రెటరీ ములకలపల్లి నరసింహారావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మండలం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు హోటల్లు, భవనాలు, వ్యాపార సముదాయానికి కేంద్రంగా ఉందన్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం అవుతున్న సందర్భంలో అప్పటికే విలువైన ఆస్తులు కాలి బూడిద అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

మండల పరీధిలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అగ్ని ప్రమాదాలను నివారించడానికి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరమని మండల పరిధిలోని గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మండలంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల అటు కుక్కునూరు 30 కిలోమీటర్లు, ఇటు జీలుగుమిల్లి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉండటం వల్ల,

ప్రమాదం జరిగినప్పుడు సకాలంలో సహాయం అందడం లేదని, కోట్లలో ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడ ఉంటుందని, వేలేరుపాడు మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే, మండల కేంద్రానికి 30 - 40 కిలోమీటర్ల దూరంలో కోయదా, కట్కూరు, చిగురు మామిడి కాకిసునూరు, పేరంటాలపల్లి, గ్రామాలతో పాటుగా తొమ్మిది గ్రామ పంచాయతీలోని గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంద న్నారు. ఆ దిశగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఆలోచించి వెంటనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story