Eluru: బ్రిటిష్ పాలన పోయింది.. అప్పుల పాలన వచ్చింది

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 9:31 PM IST
Eluru
X

Eluru: బ్రిటిష్ పాలన పోయింది.. అప్పుల పాలన వచ్చింది

Eluru: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ మార్చి 23 నుండి 30 వరకు గ్రామ, గ్రామాన భగత్ సింగ్ వర్ధంతి సభలు జరపాలనే పిలుపుమేరకు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గోమ్ముగూడెం గ్రామంలో మార్చి 30న పార్టీ మండల కార్యదర్శి కంగాల కల్లయ్య అధ్యక్షతన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్ కే గౌస్ మాట్లాడుతూ. భారతదేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, నిజమైన స్వాతంత్రం కొరకు పోరాడిన తను నమ్మిన సిద్ధాంతం భగత్ సింగ్ కోరుకున్న వ్యవస్థ ఏర్పడలేదని, స్వాతంత్ర్యం వచ్చి 80 ఎండ్లు కావస్తున్న ప్రజలకు పాలకవర్గాలు విద్యా ఉద్యోగం, వైద్యం అందించలేదని.

145 కోట్ల ఉన్న భారతదేశాన్ని 239 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ప్రజలపై పడిందని, మార్క్సిజం లేని నిజం మావో ఆలోచన విధానం సిద్ధాంతంతో ఈ దోపిడీ వ్యవస్థ మార్పు కొరకు పోరాడవలసిన అవసరం ఉందని, నేటి యువత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ఆశయం కొరకు పని చేయవలసిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు, కట్టం వీరస్వామి, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఎస్కే, మున్ని, పార్టీ డివిజన్ నాయకులు, మచ్చ ప్రశాంతు,పెంకె వీరబాబు, పెరుమాళ్ళ, శ్రీను నారం మునయ్య, జోగారావు, కృష్ణ, సుబ్బారావు, మడివి ఆదయ్య, సోడే జోగయ్య, కంగాల జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story