Atmakur: టీనేజీ ప్రెగ్నెన్సీలకు చెక్ పెట్టాలి.. ఆర్డీవో కీలక ఆదేశాలు!

Atmakur: టీనేజీ ప్రెగ్నెన్సీల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆత్మకూరు ఆర్డీవో బి. పావని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 3:34 PM IST
Atmakur
X

Atmakur: టీనేజీ ప్రెగ్నెన్సీలకు చెక్ పెట్టాలి.. ఆర్డీవో కీలక ఆదేశాలు!

Atmakur: టీనేజీ ప్రెగ్నెన్సీ నివారణ క్షేత్రస్థాయిలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతోనే సాధ్యమవుతుందని ఆత్మకూరు ఆర్డీవో బి పావని పేర్కొన్నారు. రెవెన్యూ, ఐసిడిఎస్, మెప్మా ఇలా క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఉండే పలు శాఖలా సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్టు డైరెక్టర్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా టీనేజీ ప్రెగ్నెన్సీల నివారణకు అవగాహన కార్యక్రమాలు డివిజన్ స్థాయిలో ప్రారంభించారు. జిల్లాలో ప్రధమంగా ఆత్మకూరులోని ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ సునీలత ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో బి పావని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో తో పాటు సిఐ గంగాధర్, జిల్లా అధికారి షానవాజ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి స్థానికంగా జరిగే విషయాలు తెలుస్తాయని, ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీటిని అరికట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అనంతసాగరం, ఉదయగిరి సిడిపివోలు పద్మావతి, పుణ్యవతి సాధన జోష్ణ పావని కుమారి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story