నవధాన్యాల సాగుతోనే నేల సారం.. ఏపీసీఎన్ఎఫ్ శిక్షణలో నిపుణుల వెల్లడి

APCNF: వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం (APCNF) మరియు వ్యవసాయ శాఖ అధికారుల కోసం 3 రోజుల శిక్షణా కార్యక్రమం (TOT) నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 12:26 PM IST
APCNF
X

నవధాన్యాల సాగుతోనే నేల సారం.. ఏపీసీఎన్ఎఫ్ శిక్షణలో నిపుణుల వెల్లడి

APCNF: జిల్లా స్థాయిలో APCNF మరియు వ్యవసాయ శాఖ అధికారుల కోసం 3 రోజుల ToT (Training of Trainers) శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం DAO సత్యవాణి మరియు DPM కన్నయ్య ఆధ్వర్యంలో జరిగింది.

ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉద్యాన శాఖ డైరెక్టర్ మరియు APCNF EVC టి. విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

DAO సత్యవాణి మాట్లాడుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి PMDS పద్ధతి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా గాలిలోని అధిక వేడిని తట్టుకొని, నేలను సారవంతంగా ఉంచవచ్చని వివరించారు.

PD ATMA మాట్లాడుతూ.. ప్రధాన పంటలు వేసే ముందు తప్పనిసరిగా నవధాన్యాల సాగు (PMDS) చేయడం ద్వారా, పంటలను రక్షించవచ్చని సూచించారు. ప్రతి మండలంలో తప్పనిసరిగా PMDS సాగు అమలు చేయాలని ADAలు మరియు AOలను కోరారు.

DPM కన్నయ్య మాట్లాడుతూ. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ శిక్షణలో విపులంగా వివరించారు. అదేవిధంగా RTC రవిచంద్ర ప్రసాద్ గారు నవధాన్యాల సాగు (PMDS) పై తీసుకోవాల్సిన చర్యలు, పంటలను ఎలా సంరక్షించుకోవాలో సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ADAలు, MAOలు మరియు APCNF సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story