Seethampeta: అడ్వెంచర్ పార్కులో బోటు షికారు చేసిన చైర్మన్!
Seethampeta: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి పర్యటన. ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ.
Seethampeta: అడ్వెంచర్ పార్కులో బోటు షికారు చేసిన చైర్మన్!
Seethampeta: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి సీతంపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి (TTD) ఆలయాన్ని సందర్శించారు. ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
చైర్మన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్.వైద్య సేవలపై ఆరా, ఆసుపత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి.రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు
కమిషన్ సభ్యులు గుర్ల సునీత, కడ్రక మల్లేశ్వరరావు, మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తో కలసి పాల్గొన్నారు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన చైర్మన్, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు
ఆసుపత్రిలోని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, రోగుల తాకిడి పెరిగినప్పటికీ వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో పాటు మరికొన్ని మౌలిక వసతుల అవసరం ఉందని డాక్టర్లు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర ఎస్ టి కమిషన్ చైర్మన్ సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో అడవి తల్లి విగ్రహానికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నల్ జగన్నాథ్, ఎస్టీ కమిటీ సభ్యులుతో కలిసి పూలమాలలు వేశారు.
ఎన్ టి ఆర్ అడ్వెంచర్ పార్క్ ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నల్ జగన్నాథ్, ఎస్టీ కమిటీ సభ్యులుతో తిలకించారు. పార్కులో 5డి మినీ థియేటర్లో చిత్ర ప్రదర్శన తిలకించి, బోటు షికారులో పాల్గొని పార్కు మొత్తం తిలకించి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన గిరిజనేతరులకు ఈ పార్కు మంచి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఐటీడీఏ ద్వారా అవసరమైన వసతులను కల్పించి, సిబ్బంది కొరతను తీర్చి, గిరిజన ప్రాంత ప్రజలకు సిబ్బంది మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.




