Naidupeta: సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో మార్చి 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
Naidupeta: సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లని టిట్కో ఇళ్లను ఈనెల 30వ తేదీ లబ్ధిదారులకు అందజేయడానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటకు వస్తుండడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పి సుబ్బరాయుడు కార్యక్రమం జరిగే స్థలాన్ని పరిశీలించారు.
దీనితోపాటు లబ్ధిదారులకు అందజేయవలసిన ఇళ్లను పరిశీలించడమే కాకుండా ఆరోజు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించే ఇళ్ల పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎటువంటి లోపాలు జరగకుండా అధికారులు అప్రమంతంగా ఉండాలని ముఖ్యంగా కార్యక్రమం భద్రత దృష్ట్యా పోలీసులు కూడా అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర తెలియజేశారు, ఈనెల 30 వ తేది ముఖ్యమంత్రి సూళ్లూరుపేట నియోజకవర్గానికి వస్తుండడంతో అటు తెలుగుదేశం పార్టీ నాయకులలోను, కార్యకర్తల లోనూ ఉత్సాహం మొదలైనట్టు తెలుస్తుంది.




