Amaravati: రాష్ట్రపతి భవన్‌కు 'అమరావతి' బిల్లు.. నేడే ఆమోదం?

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది.

Arun Chilukuri
Published on: 6 April 2026 2:06 PM IST
Amaravati
X

Amaravati: రాష్ట్రపతి భవన్‌కు 'అమరావతి' బిల్లు.. నేడే ఆమోదం?

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇటీవల పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఆమోదించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026' బిల్లు సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయగానే ఇది అధికారికంగా చట్టరూపం దాల్చనుంది.

పార్లమెంట్‌లో ఏకగ్రీవ ఆమోదం:

గత వారం లోక్‌సభ మరియు రాజ్యసభల్లో ఈ బిల్లుపై సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలతో సహా మెజారిటీ పార్టీలు మద్దతు తెలపడంతో, ఎలాంటి సవరణలు లేకుండానే ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశాయి. అనంతరం లోక్‌సభ సచివాలయం నిబంధనల ప్రకారం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏం జరుగుతుంది?

రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. పునర్విభజన చట్టంలోనే అమరావతిని రాజధానిగా చేర్చడం వల్ల భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి నిర్ణయాలకు అవకాశం ఉండదు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులు, గ్రాంట్ల విడుదలకు మార్గం మరింత సుగమం అవుతుంది.

న్యాయ నిపుణులతో సంప్రదింపులు పూర్తి కావచ్చాయని, ఇవాళ సాయంత్రం లోపు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసి, అమరావతి అభివృద్ధికి నూతన జవజీవాలు లభించనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story