Amaravati: ఇంచ్ కూడా కదలదు.. అమరావతే మన గుండె అసెంబ్లీలో సీఎం గర్జన!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 March 2026 7:12 AM IST
Amaravati
X

Amaravati: ఇంచ్ కూడా కదలదు.. అమరావతే మన గుండె అసెంబ్లీలో సీఎం గర్జన!

Amaravati: అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని ఉదయం శాసనసభలో 11 గంటల 11 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలుగువారు రాజధానులు కోల్పోవడంతోపాటు విమర్శలు, వివక్షత అవమానాలు దశాబ్దాలుగా భరిస్తూ వస్తున్న పరిణామాలను గుర్తు చేసిన సీఎం, భవిష్యత్తు నగరంగా అమరావతి ఎలా అభివృద్ధి చెందేదీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించారు. తీర్మానం సభ ఆమోదం పొందిన వెంటనే కేంద్ర హోంశాఖతోపాటు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్లకు సభాపతి అయ్యన్నపాత్రుడు తీర్మానాన్ని పంపారు.

ఆంధ్రప్రదేశ్​కు ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరు, ఇంచ్ కూడా కదలదని తేల్చిచెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆత్మ అని కొనియాడారు. అమరావతి అందరిదీ అనేలా దేశం గర్వించేలా నిర్మాణం చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రానికి నట్టనడుమ ఉన్న అమరావతి రాజధానిగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శాసనసభలో ఆయన మాట్లాడారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story