Ichchapuram: భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి ఇచ్ఛాపురంలో అన్నప్రసాదం వితరణ

Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వీకే పేటలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిలర్ కాళ్ల దిలీప్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామికి పూజలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 6:53 PM IST
Ichchapuram
X

Ichchapuram: భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి ఇచ్ఛాపురంలో అన్నప్రసాదం వితరణ

Ichchapuram: శ్రీరామనవమి సందర్భంగా ఇచ్ఛాపురం పట్టణం వీకే పేట, కొత్త వీధిలోని అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద స్థానిక కౌన్సిలర్ కాళ్ల దిలీప్, ఉపాధ్యాయుడు నరేంద్రనాథ్ పట్నాయక్ అధ్యక్షతన సిద్ధాంతి అశోక్ కుమార్ పండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం కొత్తవీధి యువత మజ్జిగ వితరణ చేశారు.

సాయంత్రం సంధ్య హారతి సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ కాళ్ల దిలీప్ యాదవ్ కుటుంబ సభ్యులు.. భక్తులకు పులిహోర, చక్రపొంగలి ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గుడియా హేమా, లింగ, కురేష్, సంతోష్, శంకర్ దాస్, మహేష్, సోనూపండా, కళ్యాణి సాహు, గుడియా వెంకి, నాని ఆచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story