Rayadurgam: జనసేన కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం!
Rayadurgam: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన సభ్యుడు రంగప్ప కుటుంబానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
Rayadurgam: జనసేన కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం!
Rayadurgam: రాయదుర్గం నియోజకవర్గంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన సభ్యుడు రంగప్ప కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. రాయదుర్గం పట్టణంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రంగప్ప నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రంగప్ప కుటుంబానికి జనసేన పార్టీ ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. రంగప్ప జనసేన పార్టీ సభ్యుడు కావడంతో, ఆయన కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.5 లక్షల చెక్కును జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అందజేసినట్లు వెల్లడించారు.
అనంతరం ఆదివారం సాయంత్రం రంగప్ప కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.




