Anantapur: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత రమేష్ గౌడ్ ఫైర్!

Anantapur: కాకినాడ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 Jun 2026 12:19 PM IST
Anantapur
X

Anantapur: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత రమేష్ గౌడ్ ఫైర్!

అనంతపూర్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని రమేష్ గౌడ్ ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నారో, ఏ అంశంపై మాట్లాడుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.వైసీపీ కార్యకర్తలు భయపడరు వైసీపీ నాయకులు.

కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలకు తామెవ్వరూ భయపడే ప్రసక్తే లేదని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటం తగదన్నారు.

పార్టీలు మార్చిన ఘనత పవన్ ది

సొంతంగా ఒకే విధానం లేకుండా, పార్టీలు మారుస్తూ రాజకీయాలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్‌ దని రమేష్ గౌడ్ విమర్శించారు.అలాంటి వ్యక్తి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ప్రజల మద్దతుతో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

వైసీపీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని హెచ్చరించారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు, అన్యాయాలు, శాంతిభద్రతల క్షీణత వంటి అనేక అంశాలు ఉన్నాయి.

వాటిపై దృష్టి పెట్టాల్సిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపులు పక్కన పెట్టి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి రమేష్ గౌడ్ తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story