Mucchukota: ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత రోడ్డుపై వైకాపా నేతల బైఠాయింపు!

Mucchukota: అనంతపురం జిల్లా ముచ్చుకోట వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 10 Aug 2026 3:17 PM IST
Mucchukota
X

Mucchukota: ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత రోడ్డుపై వైకాపా నేతల బైఠాయింపు!

Mucchukota: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తలపెట్టిన వైసిపి శాంతియుతరాలికి బయలుదేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైసీపీ ముఖ్య నేతల పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ముచ్చుకోట వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు ముచ్చుకోట చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకోవడం జరిగింది.

తాడిపత్రికి పోకుండా పోలీసులు ముందస్తుగా అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రహదారిపై ఆందోళనతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ధర్నా చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డితో పాటు పలువురు వైసిపి నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని పోలీసు వాహనాల్లో అనంతపురానికి తరలించారు. అనంతరం అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story